Saturday, July 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునిరుద్యోగ హామీలు అమలు చేయాలి

నిరుద్యోగ హామీలు అమలు చేయాలి

- Advertisement -

వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి
ఓయూకు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఓయూ మెయిన్‌ ‌లైబ్రరీలో నిరుద్యోగులతో సమావేశం
15న ఇందిరాపార్క్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని పిలుపు

నవతెలంగాణ–ఉస్మానియా యూనివర్సిటీ
​రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి.. పోలీసు శాఖలో కనీసం 20 వేల పోస్టులతో నియామక ప్రకటన ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఓయూ అభివృద్ధికి ఇస్తామన్న రూ.1,000 కోట్లు విడుదల చేయాలని కోరారు. శుక్రవారం ఓయూ మెయిన్ లైబ్రరీని సందర్శించిన ఆయన నిరుద్యో గులతో సమావేశమై వారి సమస్యలు తెలుసు కున్నారు. అనంతరం జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో 60 లక్షలకు పైగా కొలువులు ఖాళీగా ఉన్నప్పటికీ నియా మకాలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యో గాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యోగాల కోసం ప్రశ్నించే యువతకు బాధ్యతాయుతమైన సమా ధానాలు చెప్పాల్సిన పాలకులు.. ‘‘పకోడీలు, బజ్జీలు వేయడం కూడా ఉద్యోగాలే’’ అంటూ అవమానకర వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమన్నారు. ప్రధాని మోడీ నుంచి మొదలుకొని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వరకూ ఇదే ధోరణితో వ్యవహరించడం యువత ఆకాంక్షలను కించపరచడమేనని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఎన్నికల హామీల్లో భాగంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయలేదని జాన్‌‌వెస్లీ అన్నారు. కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందనీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతో కలిసి మొత్తం 62వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వివరించారు. దీంతో ఉద్యోగాలు లేక 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్‌ ‌చేశారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు శాఖలో 7 వేల పోస్టులకు కాకుండా కనీసం 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని, గ్రూప్–1, 2, 3, 4, డీఎస్సీ, జేఎల్, డీఎల్ తదితర నియామకాల ప్రకటనలు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు.

టీజీపీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌లో ఇప్పటికే 30 లక్షలకు పైగా నిరుద్యోగులు నమోదయ్యారని, వారికి స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ నెల 15న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న నిరుద్యోగ ధర్నాలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువజన సంఘాల కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు వారి సమస్యలపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శికి వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డా. ఆర్.ఎల్. మూర్తి, డీబీఎస్‌ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ దర్శన్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్, ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కార్యదర్శి అజయ్, ఉపాఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షులు కిరణ్, రితేష్, ఏఐఎస్‌ఎఫ్ ఓయూ అధ్యక్షుడు ఉదయ్, ఎస్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత మౌర్య, నిరుద్యోగ జేఏసీ కో-కన్వీనర్లు శీను, ఆంజనేయులు, కాశి, రాజు, ఎంఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి పల్లెర్ల సుధాకర్, ఎస్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు నవీన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -