నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌కు చెందిన యువ పారి శ్రామికవేత్త, ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఆరవ్ గార్గ్ సాధించిన అసాధారణ ప్రగతిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినం దించారు. నాలుగేండ్ల క్రితం 16 ఏండ్ల యువ ఆవిష్కర్త కన్నకలలతో ప్రారంభమైన ఒక పరిచయం, నేడు అద్భుతమైన విజయంతో పరిపూర్ణమైందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆరవ్‌తో సమావేశాన్ని నిర్వ హించారు. అనంతరం ఆ వివరాలను కేటీఆర్ మీడియాకు విడుదల చేశారు. 2022లో ఆరవ్‌ను మొదటిసారి కలిసినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆ టీనేజర్ తయారు చేసిన ఒక ఉత్పత్తిని చూపించడమే కాకుండా, సాంకేతికత ద్వారా యువతను ఎలా సాధికారిత వైపు నడిపించవచ్చో విజన్‌ను పంచుకున్నారని వివరించారు. హైదరాబాద్‌కు చెందిన యువ భారతీయులు ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారు చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపా రు. నాలుగేండ్ల తర్వాత ఆరవ్ ఇప్పుడు ఓమి అనే ప్రముఖ ఏఐ వేరబుల్ స్టార్టప్ సహ-వ్యవస్థాపకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. వినియోగదారులకు రెండో మెదడులా పనిచేసే విధంగా ఈ ఏఐ పరికరాలను రూపొందిస్తు న్నారని వివరించారు. ఈ స్టార్టప్ అంతర్జా తీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలైన ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’, ‘ఫోర్బ్స్’ లలో కూడా దీని గురించి ప్రత్యేక కథనాలు వచ్చాయని గుర్తుచేశారు. ప్రముఖ పెట్టుబడిదారులు టిమ్ డ్రేపర్, డ్రాప్‌బాక్స్ వెంచర్స్ వంటి వారి నుంచి ఈ స్టార్టప్ దాదాపు 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.25కోట్ల) నిధులను సేకరించిం దని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 25 వేల కంటే ఎక్కువ ఏఐ వేరబుల్ పరికరాలను విక్రయించిందని పేర్కొన్నారు. 2022 జనవరిలో నాటి ఐటీ శాఖ కేటీఆర్‌ను కలవడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చింని ఆరవ్‌గార్గ్ తెలిపారు. ఆ సమయంలో యువతలో సాంకేతిక పరిజ్ఞా నాన్ని పెంపొందించడం కోసం తాను ప్రారం భించిన టెచ్చుటీజ్ అనే ప్లాట్‌ఫామ్‌ను ఆయన కు పరిచయం చేశానని పేర్కొన్నారు. ఆరవ్ గార్గ్, ఓమి బృందం మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఎన్నో గొప్ప మైలురాళ్లను అధిగమిస్తారనే నమ్మకముందని తెలిపారు.
ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఆరవ్ గార్గ్‌కు కేటీఆర్ అభినందనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


