Saturday, July 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌వైద్య పరికరాల కొనుగోళ్లకు కొత్త విధానం

‌వైద్య పరికరాల కొనుగోళ్లకు కొత్త విధానం

- Advertisement -

ప్రతిపాదనలు సిద్ధం చేయండి : మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశాలు
‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రభుత్వ ఆస్పత్రులకు నాణ్యమైన వైద్య పరికరాలను వేగంగా, పారదర్శకంగా అం దించే సేకరణ వ్యవస్థను బలోపేతం చేసేం దుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని వైద్యారోగ్య శాఖమంత్రి దామోదర ‌రాజ నర్సింహ టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌‌ కోఠి లోని తెలంగాణ స్టేట్‌ ‌మెడికల్‌ ‌సర్వీసెస్‌, ఇన్ఫాస్ర్టక్చర్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ (టీజీఎంఎస్‌ఐడీసీ) ఆఫీస్‌‌లో వైద్య పరికరాల కొనుగోళ్లపై మంత్రి సమీక్ష‍ిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాస్ప త్రుల్లో ఏర్పాటు చేసే ప్రతి వైద్య పరికరమూ నాణ్యతతో, నిర్ణీత సమయంలో అందేలా చూడాలన్నారు. పారదర్శక, సాంకేతికతకు ప్రాధాన్యత నిస్తూ నూతన విధానానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశిం చారు. భవిష్యత్తులో అన్ని కొనుగోళ్లు ఒకే ప్రామాణికత ప్రకారం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యపరి కాల సేకరణ ప్రక్రియను డిజిటలైజ్‌ ‌చేయాలన్నారు. ఇండెంట్ నుంచి ఆస్పత్రిలో ఏర్పాటుచేసే ప్రతిదశనూ ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసేలా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. దీంతో పరికరాల సేకరణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో ఆ పరికరాల పని తీరును పర్యవేక్ష‍ించేందుకు సెంట్రలైజ్డ్‌‌గా డ్యాష్‌‌బోర్డును ఏర్పాటు చేయాలనీ, ప్రతి 15 రోజులకోసారీ సమీక్షించి అవసర మైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం అమ లులో ఉన్న సీఎఏంసీ అగ్రిమెంట్లను సమీక్షించి ఎస్‌ఎల్‌ఏ (సర్వీస్ లెవల్ అగ్రిమెంట్స్) పాటించని వెండర్లపై జరిమానాలు విధించేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లోని వైద్యపరికరాల పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు హైదరాబాద్ రీజియన్‌కు నలుగురు బయోమెడికల్‌ ఇంజినీర్లను, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ జోన్లకు ఒక్కొక్కరిని నియమించాలన్నారు. సమావేశంలో టీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్‌తో పాటు టీజీఎంఎస్‌ ఐడీసీలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -