నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ విద్యావేత్త, సామాజిక సంస్కర్త, కళింగ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సామంతకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ (ఏఏపీఐ) ప్రతిష్ఠాత్మక “ట్రాన్స్‌ఫార్మేషనల్ సోషల్ వర్క్ అండ్ ఇండో–యూఎస్ పార్ట్‌నర్‌షిప్ అవార్డు” లభించింది. అక్కడి ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో జులై 2 నుంచి 5 వరకు నిర్వహించిన ఏఏపీఐకాన్ –2026, ఏఏపీఐ 44వ వార్షిక మహా సభలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, మానవతా కార్యక్రమాల్లో ఆయన అందించిన విశేష సేవలు, దాతృత్వం, ప్రపంచ ఆరోగ్య సదస్సు–2026 సందర్భంగా ఏఏపీఐకు అందించిన సహకారం, భారత్–అమెరికా సంబంధాల బలోపేతానికి చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించారు. ఏఏపీఐ అధ్యక్షులు డాక్టర్ అమిత్ చక్రవర్తి సుమారు 3 వేల మంది వైద్యుల సమక్షంలో డాక్టర్ అచ్యుత సామంతకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన జీవితాంతం పేదలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విద్య, వైద్యం, మానవతా సేవల ద్వారా చేసిన కృషిని ఏఏపీఐ ప్రత్యేకంగా కొనియాడింది. ఆ సంస్థలో 1.20 లక్షలకు పైగా భారతీయ మూలాలు ఉన్న వైద్యులు సభ్యులుగా ఉన్నారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జులై 4న డాక్టర్ అచ్యుత సామంతను ప్రత్యేక అతిథిగా, ముఖ్య వక్తగా ఆహ్వానించింది.
అచ్యుత సామంతకు అమెరికన్ ఏఏపీఐ అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


