Saturday, July 11, 2026
E-PAPER
Homeఆటలుమౌంటెన్‌ గొరిల్లా ర్యాలీకి నవీన్‌

మౌంటెన్‌ గొరిల్లా ర్యాలీకి నవీన్‌

- Advertisement -

‌నవతెలంగాణ-హైదరాబాద్‌ :
హైదరాబాద్‌‌కు చెందిన ర్యాలీ డ్రైవర్‌ ‌నవీన్‌ ‌పులిగెల్లా ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐఏ ఆఫ్రికన్‌ ‌ర్యాలీ చాంపియన్‌‌షిప్‌ (ఏఆర్‌‌సీ) మూడో రౌండ్‌‌కు సిద్ధమయ్యాడు. శుక్రవారం జరిగిన అర్హత రౌండ్‌‌లో రాణించిన నవీన్‌..ప్రధాన రేసుకు అర్హత సాధించాడు. కాసరగోడ్‌‌కు చెందిన సీనియర్‌ ‌డ్రైవర్‌ ‌ముసా షరీఫ్‌‌తో కలిసి డ్యూరాన్‌ ‌రేసింగ్‌ ‌తరఫున నవీన్‌ ఏఆర్‌‌సి3 విభాగంలో పోటీపడుతున్నాడు. రువాండా నేషనల్‌ ‌ర్యాలీ చాంపియన్‌‌షిప్స్‌ ‌సైతం ఈ రేసులో జరుగుతుండగా.. మౌంటెన్‌ ‌గోరిల్లా రేసులో 307.52 కిమీ, 18 ప్రత్యేక స్టేజ్‌‌లు, 252 కిమీ పర్వత శ్రేణితో కూడిన అత్యంత క్లిష్టమైన రహదారులపై రెండు రోజుల పాటు పోటీ జరుగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -