Thursday, July 9, 2026
E-PAPER
Homeఆటలుశ్రేణిక్‌‌కు సిల్వర్‌ మెడల్‌

శ్రేణిక్‌‌కు సిల్వర్‌ మెడల్‌

- Advertisement -

ఆసియా ఆఫ్రికన్‌ ‌పసిఫిక్‌ పవర్‌‌లిఫ్టింగ్‌ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌ : దక్ష‍ిణాఫ్రికాలోని పోచ్‌ (‌పోట్జెఫ్‌‌స్ర్టూమ్‌) ‌వేదికగా జరుగుతున్న ఆసియా ఆఫ్రికన్‌ ‌పసిఫిక్‌ ‌పవర్‌‌లిఫ్టింగ్‌, బెంచ్‌‌ప్రెస్‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో తెలంగాణ అథ్లెట్‌ ‌సత్తా చాటాడు. పురుషుల సీనియర్‌ 74 కేజీల ఓపెన్‌ ‌విభాగంలో శ్రేణిక్‌ ‌మరుపాక సిల్వర్‌ మెడల్‌ ‌సాధించాడు. పోటీల్లో ఓవరాల్‌‌గా 565 కేజీల బరువు ఎత్తిన మరుపాక శ్రేణిక్‌ ‌ద్వితీయ స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ‘అంతర్జాతీయ వేదికపై భారత్‌‌కు ప్రాతినిథ్యం నా కల. ఈ పోటీల్లో ఏకంగా సిల్వర్‌ మెడల్‌ ‌సాధించటం గర్వంగా ఉంది. భవిష్యత్‌‌లో పసిడి పతకం సాధించేందుకు కృషి చేస్తాను’ అని శ్రేణిక్‌ ‌తెలిపాడు. పవర్‌‌లిఫ్టర్‌‌గా అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వెన్నంటి నిలిచి ప్రోత్సాహం అందించిన కోచ్‌ ‌తిరువీధుల కౌశిక్‌, కుటుంబ సభ్యులు, అంబేడ్కర్‌ ‌కాలేజ్‌ ‌యాజమాన్యానికి శ్రేణిక్‌ కృతజ్ఞతలు తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -