క్లబ్‌లకు కమర్షియల్ హక్కులు బదిలీ
న్యూఢిల్లీ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో పెను మార్పులకు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది పలు కారణాలతో లీగ్ ఆలస్యం కాగా.. 2026-27 సీజన్ రెగ్యులర్ విండోలో మొదలు కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4 నుంచి భారత ఫుట్‌బాల్ ధమాకా ఆరంభం కానుందని ఏఐఎఫ్‌ఎఫ్ వెల్లడించింది. దీనితో పాటు ఈ ఏడాది నుంచి లీగ్ కమర్షియల్ హక్కులు క్లబ్‌లకు బదిలీ చేసినట్టు ఏఐఎఫ్‌ఎఫ్ తెలిపింది. ఫుట్‌బాల్ సమాఖ్య ఇక నుంచి లీగ్‌కు సంబంధించి పరిపాలన, ఇతర నిర్వహణ బాధ్యతలను మాత్రమే చూడనుంది. ఎఐఎఫ్‌ఎఫ్ అధికారులతో కలిసి ఐఎస్‌ఎల్ క్లబ్‌లు స్పోర్టింగ్ క్లబ్ ఢిల్లీ, నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి, ఎఫ్‌సి గోవా ప్రతినిధులు సైతం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఐఎస్‌ఎల్ లీగ్‌కు ఆర్‌ఎఫ్‌పి (రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్), ప్రసారదారు ఒప్పందాలను నేరుగా క్లబ్‌లు పర్యవేక్షించనున్నాయి.
సెప్టెంబర్ 4 నుంచి ఐఎస్‌ఎల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


