Wednesday, August 19, 2026
E-PAPER
Homeఆటలుతన్మయ్‌ అగర్వాల్‌ సెంచరీ

తన్మయ్‌ అగర్వాల్‌ సెంచరీ

- Advertisement -

క్వాలిఫయర్‌2కు కరీంనగర్‌ డైమండ్స్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
తన్మయ్‌ అగర్వాల్‌ (137, 61 బంతుల్లో 11 ఫోర్లు, 10 సిక్స్‌‌లు) వరుసగా రెండో సెంచరీతో కదం తొక్కగా టీజీ20 లీగ్‌‌లో కరీంనగర్‌ ‌డైమండ్స్‌ ‌క్వాలిఫయర్‌2కు చేరుకుంది. గురువారం ఉప్పల్‌ ‌స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్‌‌లో రంగారెడ్డి రైజర్స్‌‌పై కరీంనగర్‌ ‌డైమండ్స్‌ 75 ‌పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ ‌చేసిన డైమండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. తన్మయ్‌ అగర్వాల్‌ ‌కెప్టెన్సీ ఇన్నింగ్స్‌‌తో చెలరేగగా, హృషికేశ్‌ ‌సింహా (50, 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. సింహా, తన్మయ్‌ ‌రెండో వికెట్‌‌కు 139 పరుగుల భాగస్వామ్యంతో డైమండ్స్‌‌కు భారీ స్కోరు అందించారు. ఛేదనలో రంగారెడ్డి రైజర్స్‌ ‌చతికిల పడింది. కెప్టెన్‌ ‌తనయ్‌ ‌త్యాగరాజన్‌ (63, 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌లు), నితిన్‌ ‌సాయి యాదవ్‌ (50) అర్థ సెంచరీలతో పోరాడినా రైజర్స్‌‌కు ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో రంగారెడ్డి రైజర్స్‌ 163 ‌పరుగులకే కుప్పకూలింది. ఎలిమినేటర్‌‌లో ఓటమితో రంగారెడ్డి రైజర్స్‌ ‌లీగ్‌ ‌నుంచి నిష్ర్కమించగా, డైమండ్స్‌ ‌క్వాలిఫయర్‌2కు చేరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -