భారత్, ఇంగ్లాండ్ ఆఖరు టీ20 నేడు
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
సౌతాంప్టన్ (ఇంగ్లాండ్) : పొట్టి ఫార్మాట్లో తిరుగులేని విజయాలు సాధించిన టీమ్ ఇండియా.. ఎట్టకేలకు వరుసగా రెండు సిరీస్ పరాజయాలు చవిచూసింది. ఐపీఎల్లో పరుగుల వరద పారించిన బ్యాటర్లు.. అదనపు బౌన్స్, స్వింగ్ లభించిన పిచ్‌పై సింగిల్ తీసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఐర్లాండ్ చేతిలో 2, ఇంగ్లాండ్ చేతిలో 3 మ్యాచ్‌ల్లో ఓడిన భారత్.. నేడు ఇంగ్లాండ్‌తో ఆఖరు టీ20లో తలపడనుంది. ఈ పర్యటనలో ఇప్పటికే ఐదు ఓటములు చూసిన భారత్ సిరీస్ చేజారినా.. ఊరట విజయంతో స్వదేశానికి చేరుకోవాలని భావిస్తోంది. సౌతాంప్టన్‌లో ఐదో టీ20 నేడు.
సమిష్టిగా మెరిస్తేనే :
భారత బ్యాటర్లు వరుసగా నిరాశపరుస్తున్నారు. ప్రతి బంతిని బౌండరీ బాదాలనే ఆత్రుత ఎక్కువైంది. ఫలితంగా పవర్‌ప్లేలోనే మిడిల్ ఆర్డర్ క్రీజులోకి రావాల్సిన దుస్థితి. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఎదురుదాడిపై పెట్టిన ఫోకస్.. క్రీజులో కాసేపు నిలవటంపై పెట్టాలి. ఇషాన్ కిషన్ టచ్‌లో కనిపిస్తున్నా.. ఆశించిన పరుగులు చేయటం లేదు. శ్రేయస్ అయ్యర్ మిశ్రమ ప్రదర్శనతోనే సరిపెట్టాడు. శివమ్ దూబె సైతం నిరాశపరిచాడు. బౌలింగ్ విభాగంలోనూ పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేదు. అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఆఖరు మ్యాచ్‌లోనైనా సమిష్టిగా రాణిస్తే ఆతిథ్య ఇంగ్లాండ్‌పై ఓ విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.
ఊరట దక్కేనా?
- Advertisement -
- Advertisement -


