- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన నీలగిరి శ్రేణికి చెందిన అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో భారత నౌకాదళంలోకి అధికారికంగా కమిషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యానికి ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి నిదర్శనమని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు భారత నౌకాదళం వ్యూహాత్మక శక్తిని ఈ యుద్ధనౌక మరింత పెంచుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
- Advertisement -



