Saturday, July 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఆరుగురి దారుణ హత్యకు సంబంధించి మృతుల బంధువులు షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు.  నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య పోలీస్‌స్టేషన్‌ రాగా, స్థానికులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. కలెక్టర్‌ వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -