Saturday, July 11, 2026
E-PAPER
Homeజాతీయంమధ్యప్రదేశ్ లో ఉద్రిక్తత..పోలీసులపై రాళ్ల దాడి

మధ్యప్రదేశ్ లో ఉద్రిక్తత..పోలీసులపై రాళ్ల దాడి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ లో బీజేపీ శ్రేణులు బరితెగించారు. పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్పీ, ఎఎస్పీతో పాటు 8మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. తల తోపాటు భుజాలకు తీవ్ర గాయం కాగా బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అదనపు బలగాలు రప్పించి బీజేపీ శ్రేణులపై లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

దాంతియా ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మద్దతుదారులు శుక్రవారం నుంచి భారీ ఆందోళన చేపట్టారు. పార్టీ టికెట్ మిశ్రకు కేటాయించాలనే డిమాండ్ తో నేషనల్ హైవే-44పై ధర్నా చేపట్టి రాకపోకలను నిలిపివేశారు. దాదాపు 25 కిలో మీటర్ల మేర రహదారిపై భారీ యోత్తున ట్రాఫిక్ జాం అయింది. కార్లు, బస్సులు, అంబులెన్స లు ఇతర వాహనాలు భారీ గా నిలిచిపోయాయి. దీంతో దాంతియాతో పాటు ఝాన్సీ, శివపురి,గ్వాలియర్ జిల్లాలకు వెళ్లే మార్గాల్లో కూడా బీజేపీ ధర్నా కారణంగా వాహనాలు నిలిచిపోయాయి.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం సంఘటన స్థలానికి చేరుకొని ధర్నాను విరమించాలని బీజేపీ శ్రేణులకు అధికారులు సూచించారు. హైవేపై రాకపోకలకు సహకరించాలని కోరారు. ఈక్రమంలోనే బీజేపీ నాయకులకు, పోలీసులకు వాగ్వావాదం చోటుచేసుకుంది. పలువురు బీజేపీ నాయకులు పోలీసులపై దూసుకెళ్లారు. ఈ తోపులాటలో పలువురు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకరావడానికి పోలీసులు మొదటగా టీయర్ గ్యాస్ ప్రయోగించారు. బీజేపీ నాయకులు ఆందోళన శృతి మించడంతో అదనపు బలగాలను రప్పించి లాఠీచార్జీ చేశారు. దీంతో బలగాలపై బీజేపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎస్పీ, ఎఎస్పీతో పాటు 8మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -