- Advertisement -
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ: ఓయు కాంట్రాక్ట్ వర్కర్స్ కి చట్టబద్ధంగా రావాల్సిన కనీస వేతనం అమలు చేయడం లేదని, దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక పోవడంతో వర్కర్స్ అంతా సమ్మెకు వెళుతున్నట్లు ప్రోగ్రెసివ్ కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) ఓయు గౌరవ అధ్యక్షులు ఎస్. ఎల్ పద్మ, అధ్యక్షులు కె. ఎస్ ప్రదీప్, కార్యదర్శి శివాజీలు తెలిపారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ లో హాస్టల్స్ లో వర్కర్స్ తో మీటింగ్ లో వారు మాట్లాడుతూ. వర్కర్స్ కి న్యాయ పరంగా రావాల్సినవి ఏమీ అమలు కావడం లేదని అన్నారు. వీక్లీ ఆఫ్, 20 రోజులకు ఒక క్యాజువల్ లీవ్, జాతీయ లేదా పండుగలకు సెలవులు ఇవ్వడం లేదా డబుల్ జీతం ఇవ్వడం లాంటివి అమలు చేయడం లేదన్నారు. 2022 నుండి కనీసం వి.డి.ఎ కూడా అమలు చేయక పోవడంతో అతి తక్కువ జీతాలకి పని చేయాల్సి వస్తుందన్నారు. ఇది వెట్టి చాకిరి కిందకే వస్తుందన్నారు.వీటిని అమలు చేయాలని లేబర్ కమీషనర్ యూనివర్సిటీకి లేఖ రాసినా పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి జీతాలు పెంచాలని, లేని పక్షంలో 13 నుండి మెస్ బంద్ చేసి, సమ్మెకు వెళ్తామని తెలిపారు.విద్యార్థులు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ, శంకర్, వెంకటేష్, ప్రవీణ్, సత్యం, అనిత, సావిత్రి, జయ, పద్మ, సామ్రాజ్య, కృష్ణ, భూమయ్య, బాబా, మల్లికార్జున్, అనిల్, అమీర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
- Advertisement -



