- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని ఎర్రకోటకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శుక్రవారం ఓ మెయిల్ ద్వారా సందేశం పంపించారని, ఎర్రకోటను పేల్చిస్తామని మెయిల్ లో పేర్కొన్నారని ముంబాయి పోలీసులు తెలియజేశారు.దీంతో ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు వెంటనే తెలియజేశామన్నారు. అప్రమత్తమైన ఢిల్లీ అధికారులు ఎర్రకోట దగ్గర తనిఖీలు చేపట్టారు. భారీ యోత్తున బలగాలు మోహరించాయి. గతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారు బాంబు పేలుళ్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజా కాల్ బెదిరింపు నేపథ్యంలో ఢిల్లీలోని నార్త్ డిస్ట్రిక్ట్ పోలీసులు రంగంలోకి దిగి, సమగ్ర భద్రతా చర్యలను చేపట్టారు.
- Advertisement -


