Friday, August 21, 2026
E-PAPER
Homeజాతీయంగుజరాత్ లో కల్తీ మద్యం తాగి 8మంది మృతి

గుజరాత్ లో కల్తీ మద్యం తాగి 8మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కల్తీ మద్యం తాగి 8మంది మృతి చెందగా, మరో 25మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన శుక్రవారం గుజరాత్ రాష్ట్రం భావ్‌నగర్‌లో జరిగింది. భావ్‌నగర్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) అక్షర్ వ్యాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అధికార యంత్రాంగం రికార్డుల ప్రకారం మొత్తం 61 మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 10 మంది గురువారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 18 మంది ఆసుపత్రికి వచ్చినప్పటికీ, వైద్యుల పరిశీలనలో వారికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేలింది. తమ రికార్డుల ప్రకారం ఎనిమిది మంది మృతి చెందారని ఆయన తెలియజేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశామని, బాధితుల రక్త నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అందజేశామని, నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. మధ్య నిషేధం అమల్లో ఉన్న గుజరాత్ లో ఈ ఘటన జరగటం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -