Friday, August 21, 2026
E-PAPER
Homeజాతీయంముమ్మరంగా సీజేపీ ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారం..

ముమ్మరంగా సీజేపీ ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: సీజేపీ ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఔసా ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇతర పాఠశాల విద్యార్థులను ఆ స్కూల్‌లో కూర్చోబెట్టారని ఆయన ఆరోపించారు. (Abhijeet Dipke) ఆ విద్యార్థుల పేర్లు స్కూల్‌ రికార్డులలో కూడా నమోదు కాలేదని తెలిపారు. ఒక మంత్రి కుక్కకు కూడా విద్యార్థుల కంటే మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి.

పదేళ్లుగా కారుతున్న పైకప్పులను బాగు చేయలేకపోయినా లేదా బెంచీల కొరతను తీర్చలేకపోయినా, ప్రభుత్వం అసలు ఏం సాధించినట్లు?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని దిప్కే డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలోని పాఠశాలల దుస్థితికి బాధ్యులైన, అధికారిక పర్యటనల పేరుతో అందుబాటులో లేని బ్లాక్ విద్యాశాఖ అధికారులను ఎనిమిది రోజుల్లోగా సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -