- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వినూత్నంగా తన కళా ప్రతిభను చాటుకున్నారు. అరటి ఆకుపై వరలక్ష్మీ మాత చిత్రాన్ని అద్భుతంగా గీసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ఆయన సృజనాత్మకతను ప్రశంసించారు. గతంలో ఆయన విత్తనాలపై, మట్టితో చిత్రాలు గీసి గుర్తింపు పొందారు.
- Advertisement -



