నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో శుక్రవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పలువురు అధికారులతో పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి వారు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన కొలతలు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం గ్రామంలో స్కూల్లో సోక్ ఫిట్, గ్రామపంచాయతీ బిల్డింగ్ దగ్గర వాటర్ హార్వెస్టింగ్ గ్రామపంచాయతీ రికార్డ్ పరిశీలించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మీకాంతరెడ్డి,ఏపీవో సుదర్శన్ సర్పంచ్ చైతన్ యాదవ్, కార్యదర్శి శివాజీతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



