నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్ జైపూర్ లో తమ ప్రతినిధులపై దాడి చేసిన బీజేపీ గుండాలను 48 గంటల్లో అరెస్ట్ చేయాలని, లేనియెడల జైపూర్ లో భారీ ధర్నా చేపడుతామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గేదెల కొట్టంలో పిల్లలకు పాఠాలు బోధిస్తున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు CJP కార్యకర్త అశుతోష్ రంకా ప్రయత్నించినందువల్లే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలనలో విద్య నిర్లక్ష్యానికి గురైందని, మంత్రి కుక్కకు ఉన్న వసతులు కూడా విద్యార్థులకు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“48 గంటల్లోగా ఆ గూండాలను అరెస్టు చేసి, పాఠశాల మరమ్మతు పనులు ప్రారంభించకపోతే, తాను జైపూర్‌కు వెళ్లి, మరమ్మతు పనులు మొదలయ్యే వరకు ఆ పాఠశాల వద్దే నిరసనకు కూర్చుంటాను” అని డిప్కే అన్నారు.



