- Advertisement -
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్
బీఆర్‌ఎస్ నాయకులు తనపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై పనిగట్టుకొని విష ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఆదిలాబాద్‌లో జరిగిన ఘటనను తనకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. కొన్ని యూట్యూబ్ చానళ్లను కొనుగోలు చేసి, నెల జీతాలు ఇస్తూ సంబంధం లేని వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి వద్దా రూపాయి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో నిజాయితీగా పనిచేసే వారినే ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు.
- Advertisement -



