Saturday, July 11, 2026
E-PAPER
Homeఆటలు16 ఏండ్ల తర్వాత సెమీస్‌లో స్పెయిన్

16 ఏండ్ల తర్వాత సెమీస్‌లో స్పెయిన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా వరల్డ్ కప్ 2026లో స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు సంచలనం సృష్టించింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఉత్కంఠభరిత క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బలమైన బెల్జియంను 2-1 తేడాతో ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. 2010లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత స్పెయిన్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ విజయంతో, డల్లాస్‌లో వచ్చే మంగళవారం జరగనున్న సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌తో స్పెయిన్ తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో మరోసారి సబ్‌స్టిట్యూట్ ఆటగాడు మైకెల్ మెరినో హీరోగా నిలిచాడు. ఆట 88వ నిమిషంలో మైదానంలోకి వచ్చిన మెరినో.. బెల్జియం సబ్‌స్టిట్యూట్ గోల్‌కీపర్ చేసిన తప్పిదాన్ని అవకాశంగా మలుచుకుని అద్భుతమైన గోల్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గతంలో పోర్చుగల్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లోనూ మెరినో ఇలాగే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి విన్నింగ్ గోల్ చేయడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -