Saturday, July 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసముద్రంలో కుప్పకూలిన విమానం..10 మంది మృతి

సముద్రంలో కుప్పకూలిన విమానం..10 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బహామాస్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ చిన్న విమానం సముద్రంలో కుప్పకూలడంతో అందులోని వారంతా ప్రాణాలు కోల్పోయారు. దేశ 53వ స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఈ విషాదం చోటుచేసుకోవడంతో బహామాస్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం, సంబంధిత విమానయాన సంస్థ ‘ఫ్లెమింగో ఎయిర్’ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

రాజధాని నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సెస్నా 402 రకం విమానం శాన్ ఆండ్రోస్ ద్వీపానికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నసావుకు పశ్చిమంగా నార్త్ ఆండ్రోస్ సముద్ర జలాల్లో ఇది కుప్పకూలిపోయింది. ప్రమాదం తర్వాత ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని బహామాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డెవిస్ తొలుత ప్రకటించినా, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. స్వాతంత్ర్య దినోత్సవం శోకదినంగా మారిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -