- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 7 ఖాళీలు ఉండగా, వీటిలో స్టేట్ లెవల్ క్యాడర్‌లో 2, మల్టీ జోనల్ క్యాడర్‌లో 5 పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూలై 10 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 17. ఎంపికైన వారికి రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు వేతనం అందుతుంది. అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
- Advertisement -


