Sunday, July 12, 2026
E-PAPER
Homeజాతీయంఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం..

ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆటోనగర్‌లోని ఒమెకానిక్ షెడ్డులో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మరమ్మ తుల కోసం గ్యారేజీలో నిలిపి ఉంచిన బస్సుల్లో ఒకదానిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే ఈ మంటలు పక్కనే ఉన్న మిగిలిన బస్సులకు వేగంగా వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు తోడు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, ఈ లోపే గ్యారేజీలో పార్కింగ్ చేసి ఉన్న ఏడు బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. లక్కీగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరగడానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -