Sunday, July 12, 2026
E-PAPER
Homeజాతీయంహిమాచల్ ప్రదేశ్‌లో యాత్రికుల బస్సు బోల్తా..16 మందికి గాయాలు

హిమాచల్ ప్రదేశ్‌లో యాత్రికుల బస్సు బోల్తా..16 మందికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో 16మంది గాయాలపాలయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 57మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ నుంచి దెహ్రాదూన్‌కు వెళ్లేందుకు యాత్రికులు ఈ ప్రైవేట్ బస్సును అద్దెకు తీసుకున్నట్లు వెల్లడించారు. 

స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుపై బోల్తా పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -