Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల హక్కులకై ఉద్యమించాలి 

మహిళల హక్కులకై ఉద్యమించాలి 

- Advertisement -

ఐద్వా ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నిర్మల 
నవతెలంగాణ – అచ్చంపేట

మహిళల హక్కులకై మహిళలు ఉద్యమించాలని ఐద్వా అధ్యక్షురాలు నిర్మల అన్నారు. ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని బీసీ సంక్షేమ హాస్టల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం  కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నిర్మల మాట్లాడుతూ.. మహిళలను అన్ని రంగాలలో రాణించాలని వారు.

నేటి సమాజంలో స్త్రీలు అన్ని రంగాలలో విజయం సాధిస్తున్నారని వారు గొప్ప పలికారు. నేటి సమాజంలో ఎంతో మంది స్త్రీలు కిందిస్థాయిలో ఇబ్బందులు గురి అవుతున్నారని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండి మహిళా హక్కులకు రక్షణ కల్పించాలని, స్త్రీలకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు రజిత, సైదమ్మ, సైపద్మ, చిట్టి, లక్ష్మి, విద్యార్థులు మమత వెంకటమ్మ శిరీష సరిత పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -