సిరీస్‌పై దృష్టి నేడు దక్షిణాఫ్రికాతో రెండో వన్డే

జెబెర్రా(సెయింట్‌ జార్జెస్‌ పార్క్‌): తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇక సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి వన్డేలో 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌.. రెట్టించిన ఉత్సాహంతో నేటి మ్యాచ్‌కు సిద్ధమైంది. పేసర్లు ఆర్ష్‌దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో చెలరేగడంతో తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు 116పరుగులకే ఆలైటైంది. ఆ లక్ష్యాన్ని టీమిండియా 2వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వన్డేల్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్‌(55), శ్రేయస్‌ అయ్యర్‌(52) అర్ధసెంచరీలతో రాణించారు. కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని టీమిండియా దుర్భేధ్య ఫామ్‌లో ఉంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో సమతూకలంలో ఉన్న టీమిండియా.. గెలుపే థ్యేయంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి పింక్‌ జెర్సీ వన్డేలో ఓటమిపాలైంది. అలాగే ఆ జట్టులో నిలకడ లేమి స్పష్టంగా కనబడుతోంది.
జట్లు (అంచనా)…
ఇండియా : కెఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), గైక్వాడ్‌, సాయి సుదర్శన్‌, శ్రేయస్‌, తిలక్‌ వర్మ, సంజు, అక్షర్‌, ఆర్ష్‌దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌, కుల్దీప్‌, ముఖేశ్‌ కుమార్‌.
దక్షిణాఫ్రికా: మార్క్‌క్రమ్‌(కెప్టెన్‌) హెన్రిక్స్‌, జోర్జి, డుస్సెన్‌, క్లాసెన్‌(వికెట్‌ కీపర్‌), మిల్లర్‌, ఫెల్హులియో, కేశవ్‌ మహరాజ్‌, బర్గర్‌, షాంసీ

Spread the love