- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘NBK111’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ బాలయ్యకు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో సంజయ్ దత్ పాల్గొంటున్నారు. వీరిద్దరి మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. మొదట నయనతార హీరోయిన్‌గా ప్రకటించినా, డేట్స్ సమస్యలతో తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
- Advertisement -



