- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ సతీష్ రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు బత్తుల శ్రీనివాస్ నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏఈ సతీష్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు
- Advertisement -



