Wednesday, July 15, 2026
E-PAPER
Homeబీజినెస్మార్కెట్లకు చమురు సెగ

మార్కెట్లకు చమురు సెగ

- Advertisement -

సెన్సెక్స్‌ 560 పాయింట్ల పతనం
ముంబయి
: పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు చమురు ధరలకు ఆజ్యం పోయడంతో దలాల్‌ స్ర్టీట్‌లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవి చూశాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరగడం, ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో ఆటో, ఫైనాన్షియల్, ఐటి రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగి సెన్సెక్స్ 561.46 పాయింట్లు కోల్పోయి 77,054.94కు పరిమితమైంది. నిఫ్టీ 158.95 పాయింట్లు నష్టపోయి 24,052.05 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజులోనే బీఎస్‌ఇలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.3 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి. చమురు సరఫరాపై ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 87 డాలర్లకు చేరగా భారత్‌తో పాటు అమెరికాలోనూ వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేశాయి. దీనికి తోడు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిరాశపరిచిన ఫలితాలు, రూపాయి బలహీనపడటంతో పెట్టుబడిదారులు భారీగా అమ్మకాల వైపు మొగ్గుచూపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -