Saturday, September 12, 2026
E-PAPER
Homeబీజినెస్సుమధుర గ్రూప్ ‘విజన్ 2030’

సుమధుర గ్రూప్ ‘విజన్ 2030’

- Advertisement -

రూ.17,000 కోట్ల పెట్టుబడి ప్రణాళిక!
హైదరాబాద్‌ :
భారత రియల్ ఎస్టేట్ రంగంలో మూడు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సుమధుర గ్రూప్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2027-2030 మధ్య కాలానికి గాను బెంగళూరు, హైదరాబాద్, చెన్నయ్‌లలో 4.5 కోట్ల చదరపు అడుగుల అభివృద్ధి లక్ష్యంతో రూ.17,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. దేశంలో వేగవంతమైన పట్టణీకరణకు అనుగుణంగా కస్టమర్లకు దీర్ఘకాలిక విలువను అందించేందుకే ఈ ప్రణాళికను రూపొందించినట్లు సుమధుర గ్రూప్ చైర్మన్ అండ్‌ ఎండీ మధుసూధన్ జి తెలిపారు. దేశంలో వేగవంతమైన పట్టణీకరణ, మౌలిక వసతుల అభివృద్ధికి అనుగుణంగా కస్టమర్లకు దీర్ఘకాలిక విలువను అందించేందుకే ఈ ‘విజన్ 2030’ ప్రణాళికను రూపొందించినట్లు స్పష్టం చేశారు.
ఈ ప్రణాళికలో భాగంగా కేవలం రెసిడెన్షియల్ పోర్ట్‌ఫోలియో కిందనే సుమారు రూ.38,000 కోట్ల అంచనా గ్రాస్ డెవలప్‌మెంట్ వాల్యూతో 35 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్టులను చేపట్టడంతో పాటు, లగ్జరీ విల్లాల సెగ్మెంట్‌లోకి కూడా అడుగుపెట్టనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -