Saturday, September 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహౌతీల దాడుల వెనుక అమెరికా?

హౌతీల దాడుల వెనుక అమెరికా?

- Advertisement -

ఓ వైపు సౌదీకి ఆయుధాల విక్రయం..మరోవైపు ట్రంప్ కుట్రలు
సౌదీలో వంద మందికిపైగాసైనిక సలహాదారులు
ఇరాన్-హౌతీల ముప్పుతో కొత్త జాయింట్ ఫోర్సెస్ కమాండ్ ఏర్పాటు
బాబ్ అల్-మందెబ్ జలసంధి కోసం ముదురుతున్న పోరు

వాషింగ్టన్ : యెమెన్‌లో హౌతీలపై సౌదీ అరేబియా సాగిస్తున్న సైనిక చర్యలకు అమెరికా తన సహకారాన్ని విస్తరిస్తోంది. సౌదీ అరేబియాలో ప్రస్తుతం 100 మందికిపైగా అమెరికా సైనిక సలహాదారులు మోహరించి, గూఢచార సమాచారం, లక్ష్యాల గుర్తింపు, భౌగోళిక సమాచార ఆధారిత టార్గెటింగ్‌లో సహాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అరేబియా ద్వీపకల్పంలో హౌతీలు-సౌదీ బలగాల మధ్య పోరు తీవ్రరూపం దాల్చుతుండటంతో.. ఈ ఘర్షణ మరో పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం నెలకొందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చర్యలో భాగంగా ఇటీవల కొత్తగా జాయింట్ ఫోర్సెస్ కమాండ్‌ను ఏర్పాటు చేసినట్టు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ హౌతీలకు అందిస్తున్న సహకారాన్ని పెంచుతున్నట్టు సంకేతాలు రావడంతో ఈ ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. సౌదీలో పనిచేస్తున్న అమెరికా సైనిక సిబ్బంది సంఖ్య దాదాపు 200 వరకు ఉండవచ్చని ఓ అమెరికా అధికారి వెల్లడిం చారు. ఈ ఆపరేషన్ గురించి తెలిసిన వర్గాలు అమెరికా సైనికుల ఉనికిని ధ్రువీకరించాయి.

సౌదీకి అమెరికా ఆధునిక సాంకేతిక సహకారం
హౌతీలపై దాడుల కోసం లక్ష్యాలను గుర్తించడంలో అమెరికా సౌదీకి ఆధునిక సాంకేతిక సహకారం అంది స్తోంది. యుద్ధరంగంలో ఏం జరుగుతోందో సైనిక అధికా రులు రియల్‌టైమ్‌లో తెలుసుకునేలా చేసే టార్గెటింగ్ టూల్‌ను ఉపయోగించడంలో అమెరికా సహకరిస్తోంది. పెంటగాన్ ఉపయోగించే ‘మేవెన’ వ్యవస్థ తరహాలో ఈ సాంకేతికత పనిచేస్తుందని అమెరికా అధికారి తెలిపారు. హౌతీ లక్ష్యాలపై దాడుల కోసం సౌదీకి ‘జియోస్పేషియల’ టార్గెటింగ్ సమాచారం కూడా అమెరికా అందిస్తున్నట్టు సమాచారం.

నేరుగా జోక్యానికి మాత్రం వెనుకడుగు
అయితే అమెరికా సహకారానికి ప్రస్తుతం కొన్ని పరిమితులు విధించినట్టు అధికారులు చెప్తున్నారు. హౌతీల పై సౌదీ జరిపే దాడుల్లో అమెరికా నేరుగా పాల్గొనడం లేదు. సౌదీ యుద్ధ విమానాలకు గగనతలంలో ఇంధనం నింప డం లేదా ఇతర ప్రత్యక్ష కార్యాచరణ సహాయం కూడా అందించడం లేదు. గతంలో హౌతీలతో జరిగిన ఘర్షణల్లో అమెరికా ఇలాంటి సహకారం అందించినప్పటికీ.. ప్రస్తుతం మాత్రం ఆ స్థాయిలో జోక్యం చేసుకోవడం లేదని సమాచారం. అమెరికా రక్షణ శాఖ మాత్రం గూఢచార వ్యవహారాలపై వ్యాఖ్యానించబోమని స్పష్టం చేసింది.

గతంలో తీవ్ర విమర్శలు
సౌదీ దాడులకు అమెరికా టార్గెటింగ్ సహకారం అందించడం గత అనుభవాల నేపథ్యంలో వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. ఒబామా, ట్రంప్ తొలి ప్రభుత్వాల కాలంలో యెమెన్‌లో సౌదీ నేతృత్వంలోని దాడులకు అమెరికా అందించిన సహకారం కారణంగా భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా సహ కారంలో అమెరికా నేరుగా దాడుల్లో పాల్గొన కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలు స్తోంది. రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా యెమెన్‌లో హౌతీల పై నెలల తరబడి సైనిక చర్యలు చేపట్టింది. అయితే ఆ ఆపరేషన్ అకస్మాత్తుగా కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. కాగా గురువారం హౌతీ దాడులను తిప్పి కోడతా నికి సహకరించాలని సౌదీ ప్రిన్స్ ..వైట్ హౌస్ కు ఫోన్ చేయగా..ట్రంప్ స్పందించటానికి నిరాకరించినట్టు సమాచారం.

బాబ్ అల్ – మందెబ్‌ జలసంధికి ముప్పు

2022 తర్వాత యెమెన్‌లో ప్రస్తుతం అత్యంత తీవ్రస్థాయిలో పోరు సాగుతోంది. ఆ ఏడాది హౌతీలు, సౌదీ మద్దతుగల యెమెన్ ప్రభుత్వా నికి మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. దేశం ఇప్పటికీ రెండు ప్రధాన ప్రాంతాలుగా విడిపోయింది. తాజాగా హౌతీల దూకుడు పెరగడం సౌదీతో పాటు అమెరికా లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల హౌతీలు ఎర్ర సముద్రంలోని వ్యూహాత్మక నౌకాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దీంతో ఎర్ర సముద్రాన్ని హిందూ మహాసముద్రం తో కలిపే కీలకమైన బాబ్ అల్-మండబ్ జలసంధికి ముప్పు పెరిగింది. ఈ జలమార్గం ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైనది. మరోవైపు ఈ వారం ప్రారంభంలో సౌదీ అరేబియాపై హౌతీలు జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో పలువురు పౌరులు మరణించినట్టు నివేదికలు చెప్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -