60 రోజుల
గ్రేస్ పీరియడ్ రద్దు!
అమెరికాలోని టెక్ కంపెనీల్లో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై
తీవ్ర ప్రభావం
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసా దారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. అమెరికాలో ఉద్యోగం కోల్పో యిన విదేశీ వృత్తి నిపుణులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసేందుకు కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ‘ఎలిమినేటింగ్ ద డిస్క్రీషనరీ 60-డే గ్రేస్ పీరియడ్’ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం శుక్రవారం ఫెడరల్ రిజిస్టరులో ప్రచురించనుంది. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయా లను తెలియజేయాల్సి ఉంటుందని డిపార్టుమెంట్ ఆఫ్ హోం లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) వెల్లడిం చింది. ఈ నిర్ణయం అమెరికాలోని టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఈ నిబంధన అమల్లోకి వస్తే వీసా గడువు ముగియకముందే ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు అమెరికాలో ఉండేందుకు వేరే అనుమతి లేకుంటే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ-1, ఈ-2, ఈ-3, హెచ్-1బీ, హెచ్-1బీ1, ఎల్-1, O-1, టీఎన్ కేటగిరీల కింద ఉన్న నాన్-ఇమ్మిగ్రెంట్లకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ గ్రేస్ పీరియడ్ రద్దు వర్తిస్తుంది. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చట్టబద్ధమైన వలసలను కట్టడి చేసేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా కఠిన చర్య ఇది.
ఒబామా హయాంలో 2016లో ఈ గ్రేస్ పీరియడ్‌ను అమల్లోకి తెచ్చారు. ఉద్యోగులు సులభంగా ఉద్యోగం మారడానికి వీలుగా ఈ వెసులుబాటు ఇచ్చారు. గ్రేస్ పీరియడ్ నిబంధనను తొలగిస్తే ప్రభావితమైన కొంతమంది విదేశీ పౌరులకు ‘నోటీసెస్ టు అపియర్’ (ఎన్టీఏ) జారీ చేయవచ్చని, ఇది వారిని దేశం నుంచి బహిష్కరించే (డిపోర్టేషన్) ప్రక్రియను ప్రారంభించడంలో ప్రభుత్వం తీసుకునే మొదటి అడుగు అని పేర్కొంది. విదేశీయుడి ఉద్యోగం ముగిసినప్పుడు యజమాని వెంటనే ప్రభుత్వానికి చెప్పా ల్సిన అవసరం ఉన్న హెచ్-1బీ, O-1, పీ వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ కేటగిరీల్లో ఉన్నవారికి NTA జారీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది.
డీహెచ్‌ఎస్ అంచనాల ప్రకారం 2025లో ఉద్యోగాలను కోల్పోయిన మార్చుకున్న వారు 65,752 మంది. 2023లో అత్యధికంగా 80,034 మంది ఉద్యోగాలను మార్చుకోవడంగానీ, పోయాక మళ్లీ వెతుక్కోవడంగానీ చేశారు. ఈ సంఖ్య 2021 ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 40,959గా ఉంది. మొత్తంగా 2021 నుంచి 2025 వరకు ఉద్యోగం కోల్పోయిన లేదా యజమానులను మార్చుకున్న 3,28,758 మంది ప్రాథమిక లబ్ధిదారుల్లో 5.77 శాతం మంది కోసం కొత్త యజమాని నాన్-ఇమ్మిగ్రెంట్ వర్కర్ల కోసం కొత్త పిటిషన్‌ను దాఖలు చేశారు.
హెచ్-1బీ వీసా అనేది ఒక నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తుల్లో విదేశీ కార్మికులను నియమించుకోవడానికి ఇది అమెరికా కంపెనీలకు అనుమతిస్తుంది. టెక్నాలజీ కంపెనీలు ప్రతి సంవత్సరం భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి దీనిపై ఆధారపడతాయి. అమెరికా చట్టం ప్రకారం ఏటా 65,000 హెచ్-1బూ వీసాలను మంజూరు చేయవచ్చు. వీటిలో మరో 20,000 వీసాలను అమెరికన్ ఉన్నత విద్యా సంస్థల నుంచి ఉన్నత డిగ్రీలు పొందిన వారికి కేటాయించారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే హెచ్1బీ వీసా దరఖాస్తుదారుల నుంచి భారీ మొత్తంలో రుసుము వసూలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్‌లపై అదనంగా 1,03,265 డాలర్ల (సుమారు రూ.86 లక్షలకు పైగా) రుసుమును వసూలు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. అన్ని రకాల క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్‌లకు ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పింది.
హెచ్-1బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



