Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీవో 97ను రద్దు చేయాలి

జీవో 97ను రద్దు చేయాలి

- Advertisement -


దాసోజు శ్రవణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

పాలిటెక్నిక్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్న జీవో 97ను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాలిటెక్నిక్ ల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని ఆయన కోరారు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన మల్టీలేయర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను విధ్వంసం చేయడం నెహ్రూ విద్యా విధానాలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీలు, నిర్బంధాలు విధించడం తగదన్నారు.
​కేజీబీవీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి : మల్క కొమరయ్య పిటిషన్
కేజీబీవీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనమండలిలో ఈ మేరకు ఆయన పిటిషన్ సమర్పించారు. క్రమబద్ధీకరణ సాధ్యం కాని పక్షంలో కనీసం దీర్ఘకాలిక ఉద్యోగ భద్రత కల్పించే విధానాన్ని రూపొందించాలని కోరారు. ఉద్యోగుల విద్యార్హతలు, సర్వీస్‌ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వేతన పరిరక్షణ, వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రాథమిక సేవా ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సిబ్బందికి తగిన గుర్తింపు, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 2024 డిసెంబర్‌ 10 నుంచి 2025 జనవరి 7 వరకు జరిగిన సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు, రెమ్యూనరేషన్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -