డీజీపీకి హెచ్ఆర్సీ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కుల ఆధారిత దూషణలు, మహిళా పోలీసు సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తనపై తెలంగాణ డీజీపీని సమగ్ర నివేదికలు సమర్పించాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ అదేశించింది. ఈ నెల 7న జరిగినట్టు ఆరోపించబడిన రెండు సంఘటనలకు సంబంధించి దాఖలైన ఫిర్యాదులపై శుక్రవారం కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నివేదిక కోసం రెండు కేసులను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లి సుధాకర్, ఇతరులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ శాసనసభ స్పీకర్, దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ ను అసభ్య పదజాలంతో దూషించారనీ, సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి వద్ద నిరసన తెలిపిన దళితులను బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్, ఇతరులు అవసమానకర పదజాలంతో దూషించినట్టు ఆరోపించారు. దళితులు నిరసన తెలిపిన చోటును శుద్ధి చేసి అవమానించారని చెప్పారు. కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ చేసిన ఫిర్యాదులో శాసనసభా ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా పోలీసు సిబ్బంది సమక్షంలో అర్థనగ్నంగా నిలబడినట్టు ఫిర్యాదు చేశారు. ఈ ప్రవర్తన మహిళా పోలీస్ సిబ్బందికి ఇబ్బందిని, మానసిక వేదనను, అవమాన్ని కలిగించి వారి గౌరవం, భద్రతపై ప్రభావం చూపిందని ఇందిరా తెలిపారు.
ఆ సంఘటనపై సమగ్ర నివేదికలు సమర్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



