Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆహార భద్రత వికలాంగుల హక్కు

ఆహార భద్రత వికలాంగుల హక్కు

- Advertisement -


 దాన్ని తొలగించే అధికారం 
కేంద్రానికి లేదు
ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల రిజర్వేషన్ రద్దుకు కుట్రలు
నవంబర్, డిసెంబర్ నెలల్లో మోడీ ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త ఉద్యమం : సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఎం అడివయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆహార భద్రత వికలాంగుల హక్కు అనీ, దాన్ని తొలగించే హక్కు కేంద్రానికి ఎక్కడిదని ఎన్‌‌పీఆర్‌‌డీ జాతీయ కమిటీ ప్రశ్నించింది. శుక్రవారం ఢిల్లీలోని హరికిషన్‌ ‌సింగ్‌ ‌భవన్‌‌లో ఆ సంఘం జాతీయ అధ్యక్షులు గిరీష్‌ ‌కీర్తి అధ్యక్షతన జాతీయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వికలాంగుల హక్కులు, వారు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై తీర్మానాలు చేసినట్టు ఎన్‌‌పీఆర్‌‌డీ జాతీయ ఉపాధ్యక్షులు ఎం అడివయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి సవరణలు చేయాలని చేసిన నిర్ణయం వికలాంగుల ఆహార భద్రత హక్కును కాలరస్తుందని పేర్కొన్నారు. పోరాటాల ఫలితంగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వికలాంగులకు అంత్యోదయ అన్నాయోజన రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎప్‌ఎస్‌ఏ సవరణలు చేయడం వల్ల వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం అమలు, పర్యవేక్షణ కోసం జాతీయ స్థాయిలో చీఫ్ కమిషనర్, రాష్ట్ర స్థాయిలో స్టేట్ కమిషనర్ లను నియమించాలని చట్టంలో ఉందని గుర్తు చేశారు. వికలాంగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ సౌకర్యాన్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందనిఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వికలాంగుల శాఖ ప్రధాన కమిషనర్ విడుదల చేసిన నివేదికలో దేశ వ్యాప్తంగా వికలాంగుల ఉద్యోగులు అనేక సమస్యలు ఎదురుకొంటున్నారని పేర్కొన్నారని, వాటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న వికలాంగుల వ్యతిరేక విధానాలపై నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశ వ్యాప్త ప్రచార ఉద్యమం నిర్వహిస్తామని తీర్మానించినట్టు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌ ‌తెలిపారు. సమావేశంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నంబు రాజన్, ఉపాధ్యక్షులు , అనిర్భన్ ముఖర్జీ, ఝాన్సీరాణి, సహాయ కార్యదర్శులు సామ్య గంగూలీ, రిషికేష్, కోశాధికారి చక్రవర్తి, కమిటీ సభ్యులు కె వెంకట్, ఆర్ వెంకటేష్, జె రాజు, రంగప్ప, రాజన్, విల్సన్లతో పాటు వివిధ రాష్ట్రల ప్రతినిదులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -