రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5వేల డాలర్లు
హార్ము జ్ ను అలా పిలిస్తే ఇరాన్ థ్రిల్ అవుతుంది : ట్రంప్
వాషింగ్టన్ : ట్రంప్ పాలనలో యుద్ధం దెబ్బకు అమెరికా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఓవైపు ఓటమి ఖాయమనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో (నగదు బదిలీ పథకం) మనీగేమ్ ను తెరపైకి తెచ్చారు.నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిన్ పార్టీ విజయం సాధిస్తే ప్రతి అమెరికన్ వయోజనుడికి 5 వేల డాలర్లు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డాలస్‌లో జరిగిన రిపబ్లికన్‌పార్టీ మిడ్‌టర్మ్ కన్వెన్షన్‌లో ప్రసంగించిన ట్రంప్ ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉన్నట్లుగా భావించి మద్దతుదారులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్లు గెలిస్తే ఓటర్లు గెలిచినట్టేనని అప్పుడు వారికి 5 వేల డాలర్లు లభిస్తాయన్నారు. దానిని “ట్రంప్ డివిడెండ్” అని పిలుస్తారని ట్రంప్ చెప్పారు. ప్రస్తుత సర్వేల్లో డెమొక్రాట్ల కంటే రిపబ్లికన్లు వెనుకబడి ఉన్న తరుణంలో ట్రంప్ ఈ హామీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి కనీసం 1 ట్రిలియన్ డాలర్ల వ్యయం అవు తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ భారీ మొత్తా నికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు. అమెరికా చాలా డబ్బు సంపాదిస్తోందని మాత్రమే చెప్పారు. ఇదే సభలో హార్ము జ్ జలసంధిని ట్రంప్ సంధిగా పిలుద్దామని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అలా పిలిస్తే ఇరాన్ కూడా థ్రిల్‌గా ఫీలవుతుందని ఎద్దేవా చేశారు. ఇరాన్ ను దెబ్బ కోట్టలేక ఏఐ ట్రూత్ పోస్టులతో కాలాన్ని నెట్టుకు వస్తున్న విషయం విదితమే.



