ఒక్కో కుటుంబంపై 763 డాలర్ల అదనపు భారం
వాషింగ్టన్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నది ఓ సామెత. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన యుద్ధం ఇప్పుడు అమెరికన్లపై మోయలేని ఇంధన వ్యయ భారాన్ని మోపుతోంది. యుద్ధం కారణంగా అమెరికా ప్రజలు ఇంధనంపై వంద బిలియన్ డాలర్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని బ్రౌన్ విశ్వవిద్యాలయం అంచనా వేసింది. ఇది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ సేనలు ఇరాన్‌పై పోరు ప్రారంభించినప్పటి నుంచి అమెరికన్లు గ్యాసోలిన్, డీజిల్ కోసం చెల్లించిన అదనపు మొత్తం. సగటున ఒక్కో అమెరికా కుటుంబంపై 763 డాలర్ల అదనపు భారం పడింది. అమెరికాలో సుమారు 131 కుటుంబాలు ఉన్నాయని బ్రౌన్ యూనివర్సిటీ అంచనా. యుద్ధం కొనసాగుతుండడంతో అదనపు భారం మున్ముందు మరింత పెరుగుతూనే ఉంటుంది. ప్రతి రెండు నిమిషాలకు సుమారు ఒక మిలియన్ డాలర్ల చొప్పున ఈ భారం పెరుగుతుంది.
అదనపు వ్యయంలో ఎక్కువ భాగం గ్యాసోలిన్‌దే. గ్యాసోలిన్, డీజిల్ రెండూ ఖరీదైనవిగా మారినప్పటికీ అమెరికన్లు చెల్లిస్తున్న అదనపు ఇంధన బిల్లులో మెజారిటీ వాటా పెరిగిన గ్యాసోలిన్ ధరల నుంచే వస్తుంది. జాతీయ సగటు గ్యాసోలిన్ ధర సోమవారం గ్యాలన్‌కు 4.15 డాలర్లకు చేరింది. కార్మిక దినోత్సవం రోజున ఈ స్థాయికి గ్యాసోలిన్ ధర చేరడం ఇదే మొదటిసారి. 2012లో కార్మిక దినోత్సవం రోజున గ్యాలన్ గ్యాసోలిన్ ధర 3.82 డాలర్లుగా నమోదైంది. కాగా కాలిఫోర్నియా, హవాలీలో గ్యాసోలిన్ ధర జాతీయ సగటును దాటి గ్యాలన్‌కు ఐదు డాలర్లకు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధరలు కూడా బాగా పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదల భారం టెక్సాస్ వాసుల పైనే అధికంగా పడింది. టెక్సాస్ వాసులు అదనపు గ్యాసోలిన్, డీజిల్ బిల్లుల కోసం 11 బిలియన్ డాలర్లు చెల్లించారు.
అమెరికన్లపై ఇంధన బిల్లుల మోత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



