లండన్ : సాంకేతిక సమస్య కారణంగా బ్రిటన్‌కు రాకపోకలు సాగించే వందలాది విమానాలు రద్దయ్యాయి. దేశంలోకి రాకపోకలు జరిపే వెయ్యికి పైగా విమానాలను బుధవారం రద్దు చేశారు. మంగళవారం కూడా బ్రిటన్ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించే 1,300 విమానాలను రద్దు చేశారు. బుధవారం ఉదయం మరో 279 విమానాలు రద్దయ్యాయి. హిత్రో, గాట్విక్ సహా పలు విమానాశ్రయాలలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నాలుగు గంటల తర్వాత ఇంజినీర్లు రంగంలోకి దిగి సమస్యను గుర్తించి పరిష్కరించారని జాతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్వీస్ (నాట్స్) తెలిపింది. అయితే విమానాశ్రయాలలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరడానికి ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. అనేక విమానాలు రద్దవడమో, ఆలస్యంగా నడవడమో దీనికి కారణం. తాజా పరిణామాలపై మండిపడిన బ్రిటన్ రక్షణ మంత్రి హైడీ అలగ్జాండర్ నాట్స్ సీఈఓను పిలిపించి పరిస్థితిపై ఆరా తీశారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ 190కి పైగా విమానాలను రద్దు చేసింది.
సాంకేతిక సమస్య వందలాది విమానాలు రద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



