Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాయుధ రైతాంగ పోరాటంతో బీజేపీకి ఏం సంబంధం

సాయుధ రైతాంగ పోరాటంతో బీజేపీకి ఏం సంబంధం

- Advertisement -

అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం కావాలి
నవతెలంగాణ-బంజారాహిల్స్‌

​తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని వక్తలు స్పష్టం చేశారు. ఆ పోరాట అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌ ట్యాంక్‌బండ్‌పై మఖ్దూం మొహియుద్దీన్‌ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు రెడ్‌షర్టు వాలంటీర్ల ప్రదర్శన సాగింది. అనంతరం తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు భవనంలోని అమరవీరుల స్థూపం వద్ద సీపీఐ జాతీయ నాయకులు కె. నారాయణ జెండాను ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు. రావి నారాయణరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షులు చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ట్రస్టు కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి వక్తలను వేదికపైకి ఆహ్వానించి చారిత్రక సాయుధ రైతాంగ పోరాట ప్రాధాన్యతను వివరించారు.
సీపీఐ జాతీయ నాయకులు కె. నారాయణ మాట్లాడు తూ.. సాయుధ పోరాట చరిత్రను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన సెప్టెంబర్‌ 11ను స్మరించు కుంటూ అమరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయాల న్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడితో రాజ్యాంగా న్ని మార్చేందుకు కుటిల యత్నాలు చేస్తోందని విమ ర్శిం చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ప్రత్యామ్నా యం కోసం ఎదురుచూస్తున్నారని, దేశంలో నీతి, ప్రజా స్వామ్యం కోసం నిలబడే వారంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో కీలక ఘట్టమన్నారు. హిందూ, ముస్లిం, లౌకిక, ప్రజాస్వామ్యవాదులంతా ఒకే వేదికపైకి వచ్చి ఉద్య మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించ కుండా వాస్తవాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. విప్లవ సినీ దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం పేదలు, రైతులు, కూలీల హక్కుల కోసం సాగిన మహత్తర పోరాటమని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సాయుధ రైతాంగ పోరాట ప్రభావంతోనే దేశంలో భూ సంస్కరణలు, ‘దున్నేవాడికే భూమి’, సామాజిక న్యాయం వంటి అంశాలు ప్రభుత్వ ఎజెండాలోకి వచ్చాయని అన్నారు. స్వాతం త్య్రానంతరం కమ్యూనిస్టుల ఉద్యమాలు, పోరాటా ల ఫలితంగానే రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి వంటి చర్యలు జరిగాయని తెలిపారు.

సినీ నిర్మాత, నటుడు మాదాల రవి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియ జేయాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్‌ పాత్రికేయులు పాశం యాదగిరి మాట్లాడుతూ.. సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. వాస్తవ చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రజా స్వామ్యవాదులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఉజ్జిని రత్నాకర్‌రావు, బొమ్మగాని ప్రభాకర్‌, సోలిపేట వెంకటేశ్వర్‌రెడ్డి, ట్రస్టు కోశాధికారి రావి ప్రతిభారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -