నిందితులను కఠినంగా శిక్షించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లెలో దళిత కుటుంబానికి చెందిన రంగముని, బీసీ సామాజిక తరగతికి చెందిన మహేశ్వరి చట్టబద్ధంగా ప్రేమ వివాహం చేసుకున్నారనీ, దీన్ని ఓర్వలేక సర్పంచ్ ప్రోద్బలంతో గ్రామ భూస్వామ్య, కుల దురహంకార శక్తులు జేసీబీ, ట్రాక్టర్లతో దళితుని ఇంటిని నేలమట్టం చేయడం తీవ్ర ఉన్మాద దాడి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. ఆ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటిని కూల్చిన కుల దురంహకార శక్తులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, గ్రామీణ పేదలపై పెత్తందారులు సాగిస్తున్న అణచివేత చర్య అహంకారానికి ప్రతీక అని తెలిపారు. బాధిత దళిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించి, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి దళితులకు తగిన రక్షణ, ఆత్మస్థైర్యం కల్పించాలని కోరారు.
దళితుని ఇంటిని జేసీబీతో కూల్చడం ఉన్మాదదాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



