Wednesday, July 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయువకుడిని కత్తులతో నరికి చంపిన దుండగులు

యువకుడిని కత్తులతో నరికి చంపిన దుండగులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నపల్లి భాస్కర్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి చంపారు. వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన భాస్కర్ అదే గ్రామానికి చెందిన నిఖిత అనే యువతిని ప్రేమించాడు. అయితే యువతి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. మూడేళ్ల క్రితమే మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత నిత్యం గొడవలు కావడంతో యువతికి ఆమె భర్త విడాకులు ఇచ్చారు. ఆ కారణంతో యువతి కుటుంబ సభ్యులే భాస్కర్‌ను చంపినట్లు అతడి సోదరుడు మధు ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -