- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం కానున్నాయి. ఒక రోజు ముందు జూలై 19న అఖిలపక్ష సమావేశం జరగనుంది. తాజాగా జూలై 21న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో NDAకు చెందిన లోక్ సభ, రాజ్యసభ, బీజేపీ నేతృత్వంలోని కూటమి సభ్యులందరూ పాల్గొంటారు. జరగబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభ్యులు అనుసరించాల్సిన ప్రణాళికలపై కీలకంగా చర్చించనున్నారు.
- Advertisement -



