మద్నూర్ బ్యాంక్ మేనేజర్ ఏ. సాయిలు
నవతెలంగాణ -మద్నూర్
ఎన్ డి సి సి బి బ్యాంకులో పిక్స్ డిపాజిట్ చేసి, అధిక వడ్డీ పొందండంటూ మద్నూర్ బ్రాంచ్ మేనేజర్ ఏ సాయిలు మండల ప్రజలను కోరారు. బుధవారం బ్యాంకు ద్వారా ప్రజలకు కల్పించే రుణాల గురించి విలేకరులకు కరపత్రాన్ని అందజేశారు. ఎన్ డి సి సి బి బ్యాంకుల ద్వారా 103 సంవత్సరాలకు పైగా బ్యాంకింగ్ సేవలతో ప్రజల మన్ననలను పొందుతోందని, అధిక వడ్డీని అందిస్తూ ప్రభుత్వ గుర్తింపు ఉన్న బ్యాంకులలో మాది ముందు వరుసలో ఉందన్నారు. మా బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే మీ డబ్బులు సురక్షితంగా.. మీకు సకాలంలో అందుతాయని చెప్పారు. పిక్స్ డిపాజిట్ చేసిన డబ్బులకు 8 శాతం వడ్డీని చెల్లిస్తుందని తెలిపారు.
సీనియర్ సిటిజన్లకు 8-50 శాతం వడ్డీ చెల్లించడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయని, పిక్స్ డ్ డిపాజిట్ తో పాటు బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్న వారికి ఒక గ్రాముకు రూ.9000 చొప్పున గరిష్టంగా రూ.25 లక్షలు అతి తక్కువ వడ్డీ రేటుతో అందిస్తున్నామని వెల్లడించారు. హౌసింగ్ లోన్ పట్టణ ప్రాంతంలో రూ.40 లక్షలు, మండల ప్రాంతాల్లో రూ.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.25 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఎన్డీసీసీబీ బ్యాంకులో లాకర్ సదుపాయం కూడా ఉందనీ, ఇతర బ్యాంకులతో పోలిస్తే అతి తక్కువ అద్దెతో లాకర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు తమ డబ్బును తమ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేసుకోవడానికి ముందుకు రావాలని, అధిక డబ్బు పొందాలని కోరారు. కర్షకమిత్ర రుణం ఎకరానికి రూ.2,50 లక్షలు గరిష్టంగా రూ.12 లక్షల వరకు బ్యాంకు నుండి నేరుగా ల్యాండ్ మార్టిగేజ్ రుణ సదుపాయం కల్పిస్తుందని, ప్రజలు ముందుకు వచ్చి ఎన్డీసీసీబీ బ్యాంకు సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు.



