Wednesday, July 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్వచ్ఛమైన ప్రేమకథని చూడబోతున్నారు

స్వచ్ఛమైన ప్రేమకథని చూడబోతున్నారు

- Advertisement -

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు “చెన్నై లవ్ స్టోరీ” మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు వేడుకలు సందడిగా జరిపారు. ఈ సందర్భంగా
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ, ‘సినిమా మొత్తం హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. నా క్యారెక్టర్ లో అనేక లేయర్స్ ఉంటాయి. మీరు స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో మా సినిమాలో చూస్తారుఅని అన్నారు. కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ,'ప్రేమ అనే పదం ఒక్కో టైమ్ లో ఒక్కోలా వినిపిస్తుంటుంది. ఇప్పుడు నాకు ప్రేమ అంటే ఈ సినిమానే అని చెప్పారు. ‘మా సినిమాలో నివి, స్టీవెన్ శంకర్ క్యారెక్టర్స్ మధ్య అందమైన సంభాషణలు ఉంటాయి. ఈ పాత్రలు ఒక్కసారి మనకు పరిచయమయ్యాక వారి పాత్ర స్వభావాల నుంచే మాటలు వచ్చేశాయిఅని డైరెక్టర్ రవి నంబూరి తెలిపారు.

స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ,' మూవీ చూస్తున్నప్పుడు సెకండాఫ్ లో కిరణ్ పర్ ఫార్మెన్స్ అద్భుతంగా అనిపించింది. చెన్నై నగరానికి ఈ కథకు సంబంధం ఉంది. అందుకే టైటిల్ చెన్నై లవ్ స్టోరీ అని పెట్టాం అని అన్నారు. ‘మా మూవీలో కిరణ్, శ్రీ గౌరి ప్రియ ఫెంటాస్టిక్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఇతర పాత్రలు చేసిన ఆర్టిస్టులు కూడా బాగా నటించారు. మణిశర్మ మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యింది. నా ఫ్రెండ్ ధీరజ్ మా మూవీకి కావాల్సిన బిజినెస్ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాడు. మా అందరి కెరీర్స్ లో హయ్యెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. రవి నంబూరి అనుభవజ్ఞుడైన దర్శకుడిలా రూపొం దించాడుఅని ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చెప్పారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,'ఈ సినిమా నాకొక మెమొరబుల్ ఫిలిం. నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండి పోతుంది. కొన్నేళ్ల తర్వాత నేను నటించిన చిత్రాల్లో ఏదైనా మళ్లీ చూడాలనుకుంటే ఈ సినిమా చూస్తాను. ఈ సినిమా విజయంపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఈ సినిమా మా నిర్మాతలకు బాగా డబ్బులు తీసుకురావాలి అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -