Wednesday, July 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'కరుణామ యమొదలైంది

‘కరుణామ యమొదలైంది

- Advertisement -

బాబీ పిక్చర్స్ మీద ప్రొడక్షన్ నెంబర్.1గా సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మించనున్న చిత్రం ‘కరుణామయ’. చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా రాబోతున్న ఈ సినిమాకి హర్షవర్దన్ పారెళ్ళ దర్శకత్వం వహించనున్నారు. ఆరాధ్య హైందవి సమర్ఫణలో ఫ్యామిలీ ఎమో షన్స్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్వహించిన పూజా కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి. దర్శకులు వి.వి. వినాయక్, వీ.ఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత సంకాబత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘క్రిస్మస్ సందర్భంగా మా సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 23న రిలీజ్ చేస్తాం. మాకు సహకరి స్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అని అన్నారు. ‘కుటుంబ కథా చిత్రంగా మా సినిమా తెరకెక్క బోతోంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాత నాగేశ్వరరావుకి థాంక్స్. తండ్రీ కొడుకు నేపథ్యంలో మంచి ఎమోషన్స్‌తో ఈ సినిమా ఉంటుంది. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందిఅని దర్శకుడు హర్షవర్దన్ పారెళ్ళ చెప్పారు. హీరో చైతన్య శక్తి మాట్లాడుతూ,' ఇంత మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా మూవీని హిట్ చేస్తారని ఆశిస్తున్నా అని అన్నారు. ‘కేవలం ఒక మతానికే చెందిన వారే కనెక్ట్ అవు తారని కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టు కునేలా మా సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. ఇందులో నా ప్రాత అందర్నీ మెప్పిస్తుంది’ అని హీరోయిన్ స్వాతి శ్రీ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -