రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూనే, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి స్తున్న సినిమా ‘ఆపరేషన్ అరుణారెడ్డి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే వహిస్తు న్నారు. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న ఈ సినిమా రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ,'పోసాని కృష్ణమురళి నాకు మంచి మిత్రులు. ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నేనూ భాగమవ్వా లని ముందుకొచ్చా. మా కాంబోలో ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయబోతున్నాం. ఇది ఒక మంచి మూవీ. మీ అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా అని అన్నారు. నటుడు, దర్శక, నిర్మాత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ,’మా సినిమా ఇంత త్వరగా షూటింగ్ చేసుకుని రిలీజ్ కు వస్తోందంటే కారణం నా మిత్రుడు శ్రీనివాస్. నేను రచయితగా వంద చిత్రాలు రాశాను. నటుడిగా వందలాది చిత్రాల్లో నటించాను. దర్శక, నిర్మాతగా సినిమాలు తెర కెక్కించాను. నేను చేసిన అన్ని చిత్రాల్లో ఈ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చానని చెప్పగలను. ఈ సినిమా రూపొందించిందుకు గర్వంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. ఎంతో సిన్సియర్ గా ఈ సినిమాను రూపొందించాను. ఇందులో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, పని చేసిన ప్రతీ టెక్నీషియన్ అద్భుతమైన అవుట్ ఫుట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా` అని తెలిపారు.
ఆద్యంతమూ ఊహించలేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



