రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన సినిమా ‘రాజా ది రాజా’. అనిల్ బోయిడపు దర్శకుడు. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పి స్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రి బ్యూటర్స్ ద్వారా ఈనెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రుత్విక్ మీడియాతో ముచ్చటించారు. నా తొలి సినిమా విడుదలకు రావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అలాగే కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. నా కల ఇప్పుడు నెరవేరబోతోంది. ప్రేక్ష కులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆసక్తి, టెన్షన్ రెండూ ఉన్నాయి. తొలి సినిమాకే రెండు గెటప్స్ చేయడాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. ఇందులోని రెండు గెటప్స్ కోసం పూర్తిగా ప్రిపేర్ అయ్యాను. విక్రమ్, కమల్ హాసన్ చేసిన విభిన్న పాత్రలు నాకు చాలా ఇష్టం. వారి స్ఫూర్తితోనే నా క్యారెక్టర్ని బాగా చేయగలిగాను. నరేష్ నా తండ్రి పాత్రలో కనిపిస్తారు. సాయికుమార్ తో నటించడం కూడా గొప్ప అను భవం. డైరెక్టర్ అనిల్ బోయిడపు చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. చాలా మంచి డైరెక్టర్ అవుతారు. నేను చేసిన షార్ట్ చూసిన తరువాత మా కుటుంబానికి నాపై మరింత నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతోనే మా అమ్మ నిర్మాతగా ఈ సినిమాని నిర్మించారు. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయననే నమ్మకంతో ఉన్నాను.
అందర్నీ మెప్పించే’రాజా ది రాజా`
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



