చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆకెళ్ల వి కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీని ఈనెల 17న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ‘ఈ చిత్రంతో నిర్మాతగా కిషోర్ కి మంచి విజయం దక్కాలి. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. కాన్సెప్ట్, కథ చాలా కొత్తగా అనిపించింది. పాటలు నాకు చాలా నచ్చాయి. చోటా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. జగపతి బాబు అన్ని రకాల పాత్రల్ని, సినిమాల్ని చేశారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మాలాంటి అప్ కమింగ్ దర్శకులందరికీ వరం. ఆయనకు ఈ మూవీతో మంచి విజయం దక్కాలి అని అన్నారు. ‘ఇలాంటి థ్రిల్లర్ మూవీని చేయడం ఆనందంగా ఉంది. ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్. ఈ మూవీలో కంటెంట్ ఉంది అని నమ్మాను. ఈ చిత్రాన్ని వదలకుండా నాకోసం చూడండి. ఈ సినిమాకి ఇంకా బిజినెస్ కాలేదు. మా తమ్మారెడ్డి, కిషోర్ ధైర్యంతో ముందు అడుగు వేశారు. ఆడియెన్స్ సినిమా చూసి మాకు డబ్బులు ఇస్తారని ఆశిస్తున్నానుఅని జగపతి బాబు చెప్పారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ, 'అవుట్ పుట్ చూశాక అద్భుతం అనిపించింది. నా ప్రొడక్షన్స్‌లో ‘అంత:పురం’ తర్వాత ఇదే బెస్ట్ ఫిల్మ్ అని తెలిపారు. ‘తమ్మారెడ్డి వల్లే నేను నిర్మాతగా నిలబడగలిగాను. ఈనెల 17న మా సినిమాకి ప్రేక్షకులు వచ్చే వరకు నేను ‘వదలా’ (నవ్వుతూ). నేను సంకల్పంతో చేసిన ప్రతీ పని విజయం సాధించింది` అని నిర్మాత కిషోర్ నాయుడు చిరుమామిళ్ల చెప్పారు.
‘వదలాహిట్ ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



