Thursday, July 16, 2026
E-PAPER
Homeజాతీయంప్రభుత్వ వైద్యుడి పర్యవేక్షణలో సోనమ్‌ వాంగ్‌చుక్‌

ప్రభుత్వ వైద్యుడి పర్యవేక్షణలో సోనమ్‌ వాంగ్‌చుక్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిర్వహిస్తున్న నిరసనలలో చేరి, 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం, భద్రతను ప్రభుత్వమే చూసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. సోనమ్‌ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన వైద్యసహాయం ప్రభుత్వమే అందించాలని ఆదేశించింది. 59 ఏళ్ల సోనమ్ నిరాహార దీక్షను విరమించకపోతే, 48 గంటల్లో ఆయన బతకకపోవచ్చని దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -